శ్రీకాకుళం : శాసనమండలి సభ్యుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి
సామాజిక సమతూకాన్ని మరోసారి పాటించారని మాజీ డిప్యూటీ సీఎం, వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల ఎంపికలో సామాజిక న్యాయానికి వైఎస్ఆర్సీపీ
కట్టుబడి ఉందని గుర్తు చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బీసీలంటే
బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అని మరోసారి జగన్
నిరూపించారన్నారు. బీసీలను, బడుగు, బలహీన వర్గాలను పరిపాలనలో భాగస్వామ్యం
చేసిన ఘనత వైఎస్ జగన్మోహనరెడ్డి దేనని తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో జిల్లా
నుంచి నర్తు రామారావును ఎంపిక చేయడం పట్ల యాదవ సామాజిక వర్గానికి ఇచ్చిన మాట
నిలబెట్టుకున్నట్లయిందని వివరించారు. గత ప్రభుత్వం బీసీలను వాడుకుని వదిలేస్తే
వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకువచ్చిన సీఎం జగన్ తగిన ప్రాధాన్యత
ఇస్తున్నారని కృష్ణ దాస్ అన్నారు.