విజయవాడ : సైనికుల సంక్షేమానికి చేయూతను అందించడం అభినందనీయమని జిల్లా సైనిక
సంక్షేమ శాఖ అధికారిణి సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ కళ్యాణ వీణ. కె (రిటైర్డ్)
ఎంబీబీఎస్ అన్నారు. భారతీయ వాయిసేనలో విశిష్ట సేవలు అందించి ఇరవై ఆరు
సంవత్సరాల పాటు భారతదేశంలో సర్వీస్ లో మొత్తం అనేక వాయిసేన స్థావరాలలో పని
చేసిన దివంగత వారంట్ ఆఫీసర్ లింగమనేని ఈశ్వర రావు గారి
జ్ఞాపకార్థం సోమవారం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిణి, సర్జన్ లెఫ్టినెంట్
కమాండర్ కళ్యాణ వీణ. కె (రిటైర్డ్) ఎం బీ బీ ఎస్ సమక్షంలో వారి కార్యాలయానికి
జీ ఎన్ వీ వీ ప్రసాద్, జే వీ ఎం రావు, టి. రాంబాబు, వీరమంచినేని సాయి ప్రసాద్,
కార్యాలయ సిబ్బంది సమక్షంలో ఈశ్వర రావు గారి కుమారుడు , సెవెన్ సీస్
ఎంటర్టైన్మెంట్ అధినేత లింగమనేని మారుతి శంకర్ ఒక హైఎండ్ కంప్యూటర్ తో పాటు
ఇరవై ఐదు వేల నగదును సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని
అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి కళ్యాణ వీణ
మాట్లాడుతూ మాజీ సైనికుల పిల్లలు అభివృద్ధి పధంలో నడుస్తూ తిరిగి సైనికుల
సంక్షేమానికి చేయూతను అందించడం అభినందనీయమన్నారు. ఆయన స్పూర్తితో మరింత మంది
ముందుకు రావాలని కోరారు. అనంతరం మారుతీ శంకర్ మాట్లాడుతూ తన బాల్యం, చండీఘడ్,
చెన్నై లో గడిచిందని అప్పటి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన తండ్రి
ఈశ్వరరావు, తల్లి ఉషా కుమారి నేర్పించిన విలువలతోనే ఈ రోజు ఈ స్థానంలో
ఉన్నానని చెప్పారు. భవిష్యత్తులో తన తండ్రి పేరు తో సేవా కార్యక్రమాలు
కొనసాగిస్తానని మారుతీ శంకర్ స్పష్టం చేశారు.