గుంటూరు : ఏలూరు జిల్లా కైకలూరు మాజీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ లాంఛనంగా
వైసీపీలో చేరారు. వెంకట రమణ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసిన
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. జయమంగళ వెంకటరమణ సీఎం జగన్ కు
శాలువా కప్పి సన్మానించారు. మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం
సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి జయమంగళ వెంకటరమణకు పార్టీలోకి ఆహ్వానం పలికారు.
వెంకటరమణను ఆత్మీయంగా హత్తుకుని అభినందన పూర్వకంగా వీపు తట్టారు. ఈ
కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా
వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల జయమంగళ వెంకటరమణ సీఎం జగన్ ను కలవడంతోనే
పార్టీ మారతారన్న వాదనలకు బలం చేకూరింది. ఆయనకు సీఎం జగన్ ఎమ్మెల్సీ ఆఫర్
చేసినట్టు ప్రచారంలో ఉంది.