వెలగపూడి : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో గ్రామ,వార్డు
సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఎపిపిఎస్సి ద్వారా
రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగే లోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం
ఉన్నసిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించుట లేదా ఇన్చార్జి బాధ్యతలు
అప్పగించడం ద్వారా త్వరిత గతిన భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాకు కలక్టర్ల సమావేశ మందిరంలో సిఎస్
అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.గ్రామ వార్డు సచివాలయాల ద్వారా
ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం, డెలిగేషన్ ఆఫ్ పవర్స్,
ఎపిపిఎస్సి ద్వారా గ్రూప్ 1,2 పోస్టుల ఖాళీల భర్తీ,ఇ-ఆఫీసు ద్వారా
ఇ-రిసీప్ట్స్,ఇ-డిస్పాచ్ ఆపరేషనలై జేషన్, ఎసిబి, విజిలెన్స్ కేసుల పరిష్కారం,
కలెక్టర్లతో వీడియో సమావేశా ల్లో వచ్చిన అంశాలపై పాలో అప్ చర్యలు,అసెంబ్లీకి
సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ ఎల్ఏక్యు, ఎల్సిక్యులపై సత్వరం సమాచారం
అందించడం, ఎపి ఆన్ లైన్ లీగల్ కేసుల మానిటరింగ్ విధానం తదితర అజెండా అంశాలపై
సిఎస్.డా.జవహర్ రెడ్డి కార్యదర్శులతో సమీక్షించారు.
ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ
కొత్త జిల్లాల్లో మండల,జిల్లా స్థాయి పోస్టులు సహా గ్రామ,వార్డు సచివాలయాల్లో
ఎపిపిఎస్సి ద్వారా ఖాళీల భర్తీ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగే లోగా తాత్కాలిక
ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించుట
లేదా ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు ద్వారా ఖాళీల భర్తీకి
వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామ వార్డు
సచివాలయాల్లో పనిచేస్తున్నఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు చర్యలు
తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1,2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే
సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని చెప్పారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో
ఇ-ఆఫీస్ విధానం కింద ఇ-రిసీప్ట్స్,ఇ-డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు
చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగ
నున్న నేపధ్యంలో అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన
వివిధ శాఖలు అందించాల్సిన సమాధానాలను త్వరిత గతిన అందించేందుకు చర్యలు
తీసుకోవాలని సిఎస్ అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. వివిధ శాఖల్లో
పెండింగ్లో ఉన్నఎసిబి,విజిలెన్సు కేసులను నిరంతరం మానిటర్ చేస్తూ ఆయా కేసుల
సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.అదే విధంగా ఎపి ఆన్లైన్ లీగల్
కేసుల మేనేజిమెంట్ విధానం కింద వివిధ శాఖల్లో నమోదు అవుతున్నకోర్టు కేసులు
సకాలంలో కౌంటర్లు దాఖలుచేయడం, కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు
తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. దీనిపై త్వరలో జిపిలు,
కార్యదర్శులతో ఒక వర్కు షాపు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.జవహర్ రెడ్డి చెప్పారు.