జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు : విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎవరూ కోరుకోవట్లేదని జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ
ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా? అని వైఎస్సార్సీపీ నేతలను మనోహర్ ప్రశ్నించారు. రాజధాని అంశంలో మంత్రుల్లోనే సఖ్యత లేదని విమర్శించారు.
రాజధానిపై వైఎస్సార్సీపీ మర్మాన్ని బయటపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అభినందనలు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
వ్యంగ్యాస్త్రాలు సంధించారు.