మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి
సచివాలయంలో ఇంధన శాఖపై సమీక్ష
వెలగపూడి సచివాలయం : ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల
వ్యవసాయ కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లను రైతులకు అందిచనున్నట్లు రాష్ట్ర
ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని మూడో బ్లాక్ లో సోమవారం
ఇంధనశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్
ను రైతన్నలకు అందించాలని సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు పనిచేయాలి.
అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుకి ఉచిత విద్యుత్ కనెక్షన్ ను మంజూరు చేయాలి.
వచ్చే నెలాఖరు నాటికి మొత్తం లక్షా పాతికవేల కనెక్షన్ లను పూర్తి చేయాలి.
అలాగే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్ లలో 100 సబ్ స్టేషన్లను కూడా
అదే గడువు నాటికి పూర్తి చేయాలన్నారు.ఈ సమీక్షలో ఇంధనశాఖ స్పెషల్ చీఫ్
సెక్రటరీ విజయానంద్, ట్రాన్స్ కో సిఎండి బి.శ్రీధర్, జెఎండి ఐ.పృథ్వితేజ్,
విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, ట్రాన్స్ కో సిఎండిలు, పలువురు అధికారులు
పాల్గొన్నారు.