గర్జన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. రైతులు సంఘటితమై చేసిన ఉద్యమానికి
తలవంచిన కేంద్రం మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడమే ఇందుకు
నిదర్శనమన్నారు. స్వాతంత్య్రం తరువాత అన్నిరంగాల్లో ఆశాజనక మార్పులు వచ్చాయని,
వ్యవసాయరంగంలో మాత్రం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా అన్నదాతల జీవితాల్లో పురోగతి
లేకపోగా పరిస్థితి మరింత దయనీయంగా మారిందని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం
చేశారు. మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన
నిర్వహించిన రైతు గర్జన సదస్సులో ‘కార్పొరేట్లకే తప్ప సామాన్యులకు మేలు చేయని
మోదీ పాలన’ అనే పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ
ఆవిష్కరించారు. రైతులు తలచుకుంటే ప్రభుత్వాల్ని నిలబెట్టగలరు, కూల్చగలరన్న
జస్టిస్ గోపాలగౌడ రైతుల ఉద్యమానికి భారత ప్రభుత్వం మూడు చట్టాలను వెనక్కి
తీసుకోవడమే నిదర్శనమన్నారు. దేశంలోని అన్నదాతల పరిస్థితి రోజురోజుకు
ఆందోళనకరంగా మారుతోందని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.రైతు బిడ్డగా నాకు తెలుసు రైతులందరూ కష్టకార్మికులు. 140కోట్ల మంది
ప్రజానికానికి అన్నం పెట్టే కష్ట కార్మికులు రైతులు. 60శాతం జనాబా ఉన్న రైతులు
సరిగా జీవనం సాగించేటట్టు ఈ దేశంలో లేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
జస్టిస్ గోపాలగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులతో కార్మికులతో పోల్చుకుంటే రైతుల పరిస్థితి ఏంటని ఆలోచించుకుని ఉంటే
ఈ ఖర్మ పట్టేది కాదు. రైతు రైతులాగా ఆలోచించకుండా తాను ఒక రాజకీయ పార్టీ
నాయకుడిగానో, కులానికి చెందిన వ్యక్తిగానో, వర్గానికి చెందిన వ్యక్తిగానో
ఆలోచించటం వల్లే ఈ దుర్వ్యవస్థ పట్టిందని రైతు నాయకుడు వడ్డే
శోభనాద్రీశ్వరరావు అన్నారు.
పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడమే రైతుల అది పెద్ద సమస్య అని భారత కిసాన్
సంఘ్ నాయకుడు రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. దేశంలో ప్రాంతాలు వేరైనా రైతుల
సమస్య ఒక్కటేనన్న ఆయన మార్చి 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం
చేయాలని కోరారు. ప్రధాని పాలన అంటే అదానీ, అంబానీల పాలన అని సినీనటుడు
నారాయణమూర్తి ధ్వజమెత్తారు. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రకు ప్రత్యేక హోదా
ఇస్తామని అన్నారు. ఇచ్చారా?. మీరు ఏది చేయటం లేదు నరేంద్ర మోడీ అని
సినీనటుడు నారాయణమూర్తి అన్నారు.