తిరుపతి : అంతరించిపోతున్న శిల్పకళను కాపాడేందుకు టీటీడీ కృషి చేస్తోందని ఈవో
ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ శిల్ప కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే
శిల్ప కళా ప్రదర్శన, అమ్మకాలను ఆయన ప్రారంభించారు. అంతరించిపోతున్న శిల్ప కళ
సంప్రదాయ సంగీత, నృత్య కళలను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృషి
చేస్తోందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ శిల్ప కళాశాలలో మూడు రోజుల
పాటు నిర్వహించే శిల్ప కళా ప్రదర్శన, అమ్మకాలను ఆయన ప్రారంభించారు. శిల్ప
కళాశాల విద్యార్థులు తయారు చేసిన ఆలయ నిర్మాణం, శిల్ప, సుధా, దారు, లోహ
శిల్పాలు, సంప్రదాయ వర్ణ చిత్రాలు, కలంకారి చిత్రాలను పరిశీలించారు. శిల్ప
కళలో నైపుణ్యం సంపాదించిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు.
టీటీడీ శిల్ప కళాశాల నుంచి వెళ్లిన అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో
మంచి స్థాయిలో ఉన్నారన్నారు. విద్యార్థులు శిల్ప కళలో నైపుణ్యం
పెంచుకోవాలన్నారు. శిల్ప కళాశాల నిర్వహణ, పరిసరాల వాతావరణం చక్కగా ఉందని
అధ్యాపకులను, విద్యార్థులను ఈవో అభినందించారు.