రాజమహేంద్రవరం : రాజమండ్రిలోని గౌతమి ఘాట్ లో కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని
హోం మంత్రి డా.తానేటి వనిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ
మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం
వెంకయ్య, విగ్రహరూప శిల్పి రాజ్ కుమార్, భాస్కర శ్రీనివాస్, ఐలాపురం రాజా,
అచ్చిరాజు, విగ్రహ కమిటీ చైర్మన్ రాయపూడి శ్రీనివాసరావు, సత్యనారాయణ, గంగాధరం,
కాళేశ్వరరావు, లక్ష్మణరావు, ఇతర నిర్వహణ కమిటీ సభ్యులు, వాకర్స్ అసోసియేషన్
సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు భాషలో రామాయణాన్ని రచించిన మహా
కవి మొల్లమాంబ అని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. మొల్లమాంబ తన రచనలలో
సంస్కృత పదాలను చాలా అరుదుగా వాడుతూ సరళమైన తెలుగును మాత్రమే ఉపయోగించారని
పేర్కొన్నారు. అలాంటి మహా కవి మొల్లమాంబ విగ్రహాన్ని రాజమండ్రి లో ఏర్పాటు
చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులకు,
నిర్వాహకులకు హోంమంత్రి డా.తానేటి వనిత అభినందనలు తెలిపారు.