విజయవాడ : మరమ్మతు పనుల కారణంగా గుంటూరు-కాచిగూడ (17251) రైలును నేటి నుంచి ఈ
నెల 28 వరకు, కాచిగూడ-గుంటూరు (17252) రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు
చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే, కాచిగూడ-మెదక్ (07577)
రైలును రేపటి నుంచి మార్చి 1వ తేదీ వరకు, మెదక్-కాచిగూడ (07578) రైలును రేపటి
నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్టున్నట్టు తెలిపింది. వీటితోపాటు మచిలీపట్టణం-
కర్నూలు సిటీ (07067) రైలును 14, 16,18, 21, 23 25, 28 తేదీల్లో, కర్నూలు
సిటీ-మచిలీపట్టణం (07068) రైలును 15, 17, 19, 22, 24, 26, మార్చి 1 తేదీల్లో
రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. గుంటూరు-సికింద్రాబాద్
(17254) ఎక్స్ప్రెస్ రైలును దొనకొండ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు
తెలిపారు. సికింద్రాబాద్- గుంటూరు (17254) ఎక్స్ప్రెస్ రైలు దొనకొండ-గుంటూరు
మధ్య ఈ నెల 18 నుంచి 27 వరకు రద్దు చేశారు. గుంటూరు- డోన్(17228) రైలును
12-28, డోన్-గుంటూరు (17227) రైలును 13 నుంచి మార్చి 1వ తేదీ వరకు రద్దు
చేశారు. గుంటూరు-తిరుపతి (17261) 19 నుంచి 28 వరకు, తిరుపతి-గుంటూరు (17262)
రైలు గుంటూరు-మార్కాపురం స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే
అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.