విజయవాడ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం
పాదయాత్ర భద్రత లోపాలపై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను
కలిసిన నేతలు పోలీసులు సృష్టిస్తున్న అడ్డంకులను, వైసీపీ నాయకుల తీరును
గవర్నర్‌కు వివరించారు. టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు
అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ నేత లోకేష్ ‘‘యువగళం’’
పాదయాత్ర కు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ను
పోలీసులు పదే పదే అడ్డుకోవడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ
విషయంపై శనివారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను తెలుగుదేశం
పొలిట్‌బ్యూరో సభ్యులు కలిశారు. లోకేష్ పాదయాత్ర కు పోలీసులు ఉద్దేశపూర్వకంగా
అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు. లోకేష్ కు
ప్రాణహాని తలపెట్టే కుట్ర జరుగుతోందని ఫిర్యాదులో తెలిపారు. సమస్యలపై ఫిర్యాదు
చేసేందుకు ఇప్పటి వరకు డీజీపీని కలిసే అవకాశం రానందున ఆయన్ని కలిసే అవకాశం
కల్పించమని గవర్నర్‌ను తెలుగు దేశం నేతలు కోరారు. పోలీసులు అడుగడుగునా
పాదయాత్ర కు అడ్డంకులు సృష్టించటం, ప్రజలతో మాట్లాడకుండా మైక్ నియంత్రించడం,
కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలను గవర్నర్ దృష్టికి టీడీపీ బృందం
తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఫిర్యాదుపై తప్పక న్యాయం చేస్తానని గవర్నర్ హామీ
ఇచ్చారు. ఇప్పటి వరకు 18 సార్లు ఫిర్యాదు చేశామని, వేటిలోనూ తమకు న్యాయం
జరగలేదని గవర్నర్‌కు తెలుగు దేశం నేతలు వివరించారు. నిఘా ముసుగులో పోలీసులు
డ్రోన్ల ద్వారా లోకేష్ లేని చోట చిత్రీకరిస్తున్న దృశ్యాలు గవర్నర్‌కు
అందజేశారు. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, వర్ల
రామయ్య రాజభవన్లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.
కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం గౌతమ్ సవాంగ్ ల
పరిస్థితి ఏమైందో అధికారులు ఆలోచన చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే రేపటి నుంచి రోడ్డెక్కి
ఉద్యమిస్తామన్నారు. వర్ల రామయ్య మాట్లాడుతూ సర్కస్‌లో జోకర్లలా పోలీసులు
వ్యవహరిస్తున్న తీరును గవర్నర్‌కు నివేదించామన్నారు. పోలీసులు సృష్టిస్తున్న
అడ్డంకులపై తాను మీడియాలో చూస్తున్నానని గవర్నర్ అన్నారని తెలిపారు.