విజయవాడ : పాతికేళ్లుగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న 1998 డీఎస్సీ
క్వాలిఫైడ్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త అందించారని
రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు.
ముఖ్యమంత్రి నిర్ణయంతో 4534 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రావడంతో వారి
కుటుంబాల్లో వెలుగులు నిండాయి. వారంతా టీచర్లుగా రాణించాలని ఉత్తమ
విద్యార్దులను తయారు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. సీఎం జగన్ చెప్పారంటే
చేస్తారంతే ఈ విషయం రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టి అడిగినా చెబుతారని ఆయన
అన్నారు.
ఆరోగ్యశ్రీతో బాలుడికి పునర్జన్మ
తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో వైద్యులు ఓ బాలుడికి
గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా నిర్వాహించారని, బాలుడికి
పునర్జన్మనిచ్చిన వైద్యులకు అభినందనలు తెలియజేస్తున్నానని విజయసాయి రెడ్డి
తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు విడుదల చేసి నిరుపేద
గుండెకు ఊపిరి పోసిందని అన్నారు.
జగనన్న గోరుముద్దలో రాగిజావ
మార్చి నుంచి జగనన్న గోరుముద్దలో అదనంగా రాగిజావ అందించనున్నారని, ఈ మేరకు
రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి ట్రస్టు తో ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. 6వ
తరగతి, ఆపై తరగతి గదుల్లో ఇంటరాక్షన్ ప్లాట్ ప్యానల్లు ఏర్పాటు చేయనున్నారని,
6వ తరగతి లోపు తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయనున్నారని అన్నారు.
ఈ ఏడాది జూన్ నాటికి 30,230 తరగతి గదుల్లో ఈ సౌకర్యాలు కల్పించనున్నారని
అన్నారు. నాడు-నేడు తొలిదశలోని సుమారు 15,000 స్కూళ్లలో ఈ ఏర్పాటు
చేయనున్నట్లు ఆయన తెలిపారు.