అమరావతి : హైదరాబాదులో నిర్వహించిన ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ కార్ రేసింగ్ కు
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా హాజరయ్యారు. ప్రతిష్ఠాత్మక రీతిలో
నిర్వహించిన ఈ ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ను ఆయన గ్యాలరీ నుంచి తిలకించారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కూడా అమర్నాథ్ కలిశారు. రేసుకు హాజరైన సందర్భంగా
ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా-ఈ రేసింగ్ ఈవెంట్ తో హైదరాబాదుకు
అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, గర్వకారణంగా భావిస్తున్నామని తెలిపారు.
తెలుగు ప్రజలు కలిసి నిర్మించిన నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు. ఫార్ములా
రేస్ ను నిర్వహించే దిశగా ఏపీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖను
హైదరాబాద్ నగరంలా అభివృద్ధి చేస్తామని అమర్నాథ్ అన్నారు.