సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్
చూసిన తరువాత దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణ
ఉపాధి హామి పథకానికి నిధుల్లో కోత విధించటం, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు
పెరుగుదలను నిరససిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు
తెలపాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో
కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఉన్న హెడ్పోస్టాఫీసు ఎదుట నిర్వహించిన నిరసన
కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు
అధ్యక్షతన శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ
నిత్యావసరాల ధరలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగటంతో
సామాన్యులు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు
ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.
మోదీ వచ్చిన తరువాత 45ఏళ్ల చరిత్రలో నిరుద్యోగం బాగా పెరిగిందన్నారు. రైతుల
ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ ప్రభుత్వ రైతాంగానికి కేటాయించే
బడ్జెట్లో 50శాతం కోత విధించారని ఆరోపించారు. అదానీకి లక్షల కోట్లు కూడబెట్టేందుకు మోదీ ప్రభుత్వం
వ్యవహరిస్తుందని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మోదీ 90 నిమిషాలు
మాట్లాడారని తెలిపారు. ఇంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు ఆందోళన
చేస్తూనే ఉన్నారని తెలిపారు. అయినా ఎవరినీ ఖాతర్ చేయకుండా అదానీకి మోదీ అన్నీ
కట్టబెడుతున్నారని చెప్పారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనను
విమర్శించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కూడా అవినీతిలో కూరుకుపోతున్నాయని
ఆరోపించారు. దేశ్యవాప్తంగా చేపట్టిన కార్యక్రమాలలో సీపీఐ క్రియీశీలక పాత్ర
పోషించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి
రాష్ట్ర్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర
కార్యదర్శి ్గ పి.దుర్గాభవాని, నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా
వీరభద్రరావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు బుట్టిరాయప్ప, కె.వి.భాస్కరరావు,
తాడి పైడియ్య, మూలి సాంబశివరావు, పంచదార్ల దుర్గాంబ, నగర కార్యవర్గ సభ్యులు
డి.వి.రమణబాబు, కొట్టు రమణారావు, తూనం వీరయ్య, సంగుల పేరయ్య, కొడాలి
ఆనందరావు, ఓర్సు భారతి, దుగ్గిరాల సీతారామమ్మ, సిపిఐ నాయకులు
కె.ఆర్.ఆంజనేయులు, చీపిళ్ళ సత్యనారాయణ, వియ్యపు నాగేశ్వరరావు,
ఆర్.పిచ్చయ్య, పడాల కనకారావు, పూసర్ల లక్ష్మణరావు, సయ్యద్ సుభానీ,
ఆర్.మైకేల్, పగిడికత్తుల రాము, ఎస్.వి.రమణ, కంచర్ల నాగేశ్వరరావు,
టి.పూర్ణయ్య, సి.హెచ్.వి.రమణ, ఉప్పలపాటి శివప్రసాద్ రాజు, దాసిన నారాయణరావు,
బత్తుల తిరపతయ్య, శీలం సోమేశ్వరరావు, బెవర శ్రీనివాసరావు, రాచాకుల
శ్రీనివాసరావు, కెండేటి శ్రీనివాసరావు, ఎస్.కె.నజీర్, పత్తిపాటి రాజు, గాడి
రాము, ఎస్.కె.ఆలీ, మహిళా సమాఖ్య నాయకులు పి.రాణి, తమ్మిన దుర్గ, దుర్గాసి
రవణమ్మ, డి.పుష్ప, చింతాడ పార్వతి, ఆర్.అనసూయ, అండిమాని నాగమణి, సావిత్రి,
చొప్పా శ్రీరామ చంద్రమూర్తి, అంజూరి సూరిబాబు, ఎఐఎస్ఎఫ్ నాయకులు
ఎం.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.