శ్రీహరికోట : ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి
ఎస్ఎస్ఎల్వి డి2 అనే చిన్న తరహా రాకెట్ ద్వారా మూడు ఉపగ్రహాలను నింగిలోకి
పంపడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి
సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ ఈ తెల్లవారుజామున 2.48 నిమిషాలకు మొదలైంది. ఈ
కౌంట్ డౌన్ 6.30 గంటలపాటు కొనసాగి ఈ ఉదయం 9 గంటల 18 నిమిషాలకు షార్ లోని
మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఎస్ ఎస్ ఎల్ వి డి-2 రాకెట్ ద్వారా ఉపగ్రహాలను
నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు గల
ఇ వో ఎస్-07, చెన్నై స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల
బాలికలు రూపొందించిన 8.7కిలోల బరువు వున్న ఆజాది శాట్-2 అనే ఉపగ్రహాన్ని, యు
ఎస్ ఏ అంటారిస్ కు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్ -1అనే ఉపగ్రహాలను
నింగిలోకి ప్రవేశ పెట్టనున్నారు.