నెల్లూరు : వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేపై ఆ పార్టీ ఎంపీ, నెల్లూరు రూరల్
నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రోజూ ప్రెస్
మీట్లు పెడుతూ, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గత
మూడున్నరేళ్లలో ఎన్నో అరాచకాలు చేశారని ఆరోపించారు. కోటంరెడ్డి అసలు
స్వరూపాన్ని త్వరలోనే ప్రజల ముందు బయటపెడతానని చెప్పారు. గత ఎన్నికల్లో
నెల్లూరు రూరల్ లో ఎమ్మెల్యే కంటే తనకు 5 వేల ఓట్లు ఎక్కువగా వచ్చాయని
తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసేది
తానేనని చెప్పారు. పోరాటాల నుంచి వచ్చానంటూ ప్రజలను కోటంరెడ్డి వేధింపులకు
గురిచేస్తున్నాడని విమర్శించారు.