విజయవాడ : బెంగుళూరుకు చెందిన రియో, క్యూజర్ టెక్నాలజీస్ సంస్థల సంయుక్త
ఆధ్వర్యంలో బెంజి సర్కిల్ సమీపంలో గల వేదిక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన
ఎడ్యుకేషన్ ఎక్స్ పో-2023 గురువారం ప్రారంభమైంది. ఇస్కాన్ ప్రెసిడెంట్ చక్రదరి
దాస్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు మంచి వ్యక్తిత్వం,
సమర్థతను కలిగి ఉన్నత శిఖరాలు అధిరోహించి సమాజానికి తమవంతు చేయూత అందించాలని
సూచించారు. విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడాలంటే కాలానుగుణంగా మారుతున్న
సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే
సంస్థల ఎంపిక చాలా కీలకమన్నారు. ఉన్నత విశ్వవిద్యాలయాలుగా ఉన్న బెంగుళూరుకు
చెందిన ఎం ఎస్ రామయ్య విశ్వవిద్యాలయం, నిట్టే మీనాక్షి, సి యం ఆర్
విశ్వవిద్యాలయం, ఆచార్య వంటి ప్రముఖ సంస్థలను ఒక వేదికపైకి తీసుకువచ్చి
విద్యార్థులకు కావాల్సిన సమాచారం తో పాటు కెరీర్ గైడెన్స్ ఇచ్చేందుకు
ఎడ్యుకేషన్ ఎక్స్ పో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. దీని ద్వారా వారి
అభిరుచులకు అనుగుణంగా కోర్సు , విద్యాసంస్థను ఎంపిక చేసుకునే వెసులుబాటు
కలుగుతుందని తెలిపారు.
ఎక్స్ పో నిర్వహకులైన రియో టెక్నాలజీస్, క్యూజర్ టెక్నాలజీస్, బెంగుళూరు
స్టడీస్ మేనేజింగ్ డైరెక్టర్ లు వినయ్ రమేష్, సతీష్ మాట్లాడుతూ ఎక్స్ పో లో
20కి పైగా విద్యాసంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుని వారి భవిష్యత్తు ను ఉన్నతంగా తీర్చిదిదేసుకోవలని కోరారు.
నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఎక్స్ పో ని సందర్శించి ఆయా
సంస్థల ప్రతినిధుల నుంచి తమకు కావాల్సిన వివరాలు సేకరించుకున్నారు. ఈ
కార్యక్రమంలో శారదా కాలేజి జి యం జి వి రావు, శ్రీ కృష్ణ అకాడమీ డైరెక్టర్ బి
కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.