గుంటూరు : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యాటక శాఖ అధికారులతో
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి పై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ
సమావేశం నందు ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టుల వివరాల స్థితిగతులపై ఆమె
సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ అనువైన పర్యాటక అభివృద్ధి స్థలాలపై
చర్చించారు. దర్శనీయ ప్రదేశాల పర్యాటక అభివృద్ధిపై సమీక్షించి దానికి
సంబంధించి సమస్య పరిష్కార మార్గాలను సూచించారు. పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి
నిమిత్తం వివిధ శాఖల దగ్గర ఉన్న ప్రాజెక్టుల వివరాలు స్థితిగతులు చర్చించారు.
ఆయా శాఖలతో సమీక్షించి వెంటనే ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు కు
సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల టెండర్స్
స్థితిగతులను సమీక్షించారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు మంత్రులు,
శాసనసభ్యులు అడిగిన ప్రతిపాదనలు స్థితిగతులను సమీక్షించారు. ప్రజా ప్రతినిధులు
ఇచ్చిన ప్రతిపాదనలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను
సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసాద్ పథకం కింద రాష్ట్రం నుండి పంపిన
ప్రతిపాదన వివరాలు, ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలు చర్చించారు. కేంద్ర
ప్రభుత్వం దగ్గర నిలిచిన ప్రాజెక్టులను వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి
ఆమోదించేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి అందరం కృషి
చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశం నందు పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య
కార్యదర్శి రజత భార్గవ , ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్
మేనేజింగ్ డెరైక్టర్ కన్నబాబు ఐఏఎస్, పర్యాటక అభివృద్ధి అథారిటీ డిప్యూటీ సి ఈ
ఓ రాముడు, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్స్
గోవిందరావు మల్రెడ్డి గారు, భవాని ఐలాండ్ అభివృద్ధి కార్పొరేషన్
ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ బలరాం రెడ్డి, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ జనరల్
మేనేజర్ పాల్గొన్నారు.