చంద్రబాబుది విభజించు పాలన.. సీఎం జగన్ ది ప్రజా పాలన: పెనమలూరు ఎమ్మెల్యే,
మాజీ విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథిసామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత, నాణ్యమైన విద్యను
వైసీపీ ప్రభుత్వం అందిస్తుందని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
తెలిపారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో
విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. మానవ వనరుల అభివృద్ది జరగడం
వల్ల రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని నమ్మిన ఏకైక సీఎం జగన్ అని ఆయన
కొనియాడారు. చంద్రబాబు, జగన్ లక్ష్యంలో తేడా ఉందని దానిని రాష్ట్ర ప్రజలు
గమనించాలని ఎమ్మెల్యే కోరారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ 99.5 శాతం వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని
దీనిని ఓర్వలేని ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన
మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుంటే అల్లర్లు, వర్గ విభేదాలు
క్షుద్ర రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలు పబ్బం గడుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం
చేశారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు
రీయంబర్స్ మెంట్ చెల్లిస్తుందని వివరించారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా
విద్యా రంగానికి 30వేల కోట్లు కేటాయించి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని
ఎమ్మెల్యే అన్నారు. కోట్ల విలువైన బైజ్యూస్ కంటెంట్ ను పేద పిల్లలకు ఉచితంగా
అందిస్తున్న ఏకైక ప్రభుత్వం అని తెలిపారు. కేవలం అర్హత ఆధారంగా పథకాలు
అందిస్తూ సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని.. కొన్నిచిన్న చిన్న సమస్యలను
పెద్దవిగా చేసి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రతిపక్షం చేస్తోన్న క్షుద్ర రాజకీయాలను ప్రజలు నమ్మవద్దని ఆయన హితవు పలికారు.
విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను ఇతర రాష్ట్ర
ప్రభుత్వాలతో పాటు ప్రపంచ దేశాల నిపుణులు ప్రశంసిస్తున్నారని అన్నారు. రాష్ట్ర
వ్యాప్తంగా అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల్లో
అన్ని సౌకర్యాలతో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన
గుర్తుచేశారు. నాడు-నేడు పేరును PM SHRI (PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా)గా
మార్చారని ఆయన చెప్పారు. టీడీపీ హయాంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు
గ్రేడింగ్ ప్రకారం దేశంలో 24వ ర్యాంక్‌లో ఉండేదని నేడు 7వ స్థానంలో
కొనసాగుతుందని వివరించారు.