శ్రీకాకుళం : వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటెయ్యాలో చెప్పకూడదని ఎవరు
చెప్పారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి
వస్తే మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనేనని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం
జిల్లా సత్తివాడలో గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన
విపక్షాలపై మండిపడ్డారు. దేశమంతా ధరలు పెరుగుతుంటే ఏం చేయగలం అని ప్రశ్నించారు.
వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటు వెయ్యాలో ఏ పార్టీ మంచిదో చెప్పకూడదని ఎవరు
చెప్పారని అని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం గార మండలం సత్తివాడ గ్రామంలో నిర్వహించిన
గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వాలంటీర్లను
ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రతి వాలంటరీకి తన పరిధిలో ఉన్న 50 కుటుంబాలకు
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలియపరుస్తూ నచ్చ చెప్పాల్సిన
బాధ్యత ఉందన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయి
అంటున్నాయన్న ధర్మాన దేశమంతా ధరలు పెరిగాయని ఇటువంటి కారణాలు చెప్పి ప్రభుత్వం
చెడ్డదనిపించడానికి లేదన్నారు. అప్పల నరసమ్మ ఎన్టీ రామారావు భక్తురాలని
అంటుంది. సినిమా వేరు నిజ జీవితంలో జరిగేది వేరన్నారు. అన్ని కులాల వారు కలిసి
జీవిస్తున్న ఇటువంటి గ్రామంలో కూడా చైతన్యం రాకపోతే ఎలా అన్నారు. తమ
ప్రభుత్వంలో భూ సర్వే చేపిస్తున్నామని ధర్మన తెలిపారు. ఇప్పటి వరకు ప్రతి
గ్రామంలో భూమి సమస్యపై గొడవలు పడుతున్నారని, ఇకపై అలాంటి గొడవలు లేకుండా
చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయానికి నీరు
ఇవ్వడానికి ప్రయత్నించింది జగన్, ధర్మాన అని తెలుసుకోవాలంటూ వెల్లడించారు.
వాలంటీర్ ప్రతి అంశాలు ప్రజలకు చెప్పాలని, వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి
ఓటెయ్యాలో చెప్పకూడదని, ఎవరు చెప్పారన్న మంత్రి చంద్రబాబు అధికారంలోకి వస్తే
మొదట తుపాకీ పేలేది వాలంటీర్ల పైనేనని వ్యాఖ్యానించారు. ఆ తుపాకీ పేలక ముందే
మనమే తుపాకీ పేల్చాలని మంత్రి ఎద్దేవా చాశారు. ఆయన ప్రసంగంలో భాగంగా ధర్మాన
నోట బూతు పదం దొర్లడంతో ప్రజలు విస్మయం వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వం ఇచ్చే
పథకాలు తీసుకుని వాడు హాయిగా ఉంటాడు. కానీ వాడి కుటుంబం హాయిగా గడవడానికి
కారణం అయిన ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. నువ్వు సినిమా హీరోకు అభిమాని
అయినంత మాత్రానా ఆ హీరో కోసం మాట్లాడుతావు. వాలంటీర్లు ఏ రాజకీయ పార్టీకి
ఓటెయ్యాలో చెప్పకూడదని, ఎవరు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట
తుపాకీ పేలేది వాలంటీర్లపైనే. అందుకనే మనమే ముందు తుపాకీ పేల్చాలని రెవెన్యూ
శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.