విశాఖపట్నం : మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర రెవెన్యూ చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. విశాఖలో ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి రాష్ట్రంలో వివిధ సమస్యల్లో ఉన్న భూములను వినియోగంలోకి తెచ్చేందుకే ఈ మార్పులు చేస్తున్నామని అన్నారు. ఎసైన్డ్ భూములను విక్రయించే అధికారం లేదు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.