విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో వరసగా మూడేళ్లలో అదనంగా 2,550 మెడికల్ సిట్లు
అందుబాటులోకి రావడంతో వైద్య విద్యా రంగంలో విస్తృత అవకాశాలు కలగనున్నాయని
వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆదివారం పలు అంశాలపై ఆయన స్పందించారు..
ఎ.పిలో 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.8480 కోట్లు వ్యయం
చేస్తుందని చెప్పారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలో
అడ్మిషన్లు ప్రారభం కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో అన్నిటికంటే విద్య
పైనే ఎక్కువ నిధులను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయిస్తోందని
చెప్పారు..జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం టాప్ 200 విదేశీ వర్సిటిలలో సిట్లు
తెచ్చుకున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నదని చెప్పారు. సంతృప్తి స్థాయిలో
ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి రాష్ట్ర
ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా స్పదనలో అత్యధిక అర్జీలు
అందుకుంటున్న విభాగ అధిపతులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష
నిర్వహించారని ఆయన చెప్పారు.