విజయవాడ : అభివృద్ది పై చర్చకు సిద్ధమని పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక కొత్తపేట 51,53,54 డివిజన్లలో
ఆదివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ మంత్రి, పశ్చిమ
నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కోటి 99 లక్షల రూపాయల
నిధులతో గణపతిరావు రోడ్ ను సీసీ రోడ్ వేసేందుకు శంకుస్థాపన చేశారు. అనంతరం
డ్రైన్ వీధిలో సైడు కాలువలు రోడ్ వేసేందుకు 53వ డివిజన్ లో నూతన వాటర్ పైపులు
వేసేందుకు శంకుస్థాపన చేశారు. అనంతరం వెలంపల్లి మాట్లాడుతూ గణపతి రావు రోడ్
సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు.
2కోట్లతో సిమెంట్ రోడ్ నిర్మిస్తున్నామన్నారు.డ్రైన్ వీధిలో కాలువలు కూడా
నిర్మిస్తున్నామన్నారు.ఎప్పటి నుండి ప్రజల కోరికను నేడు
నేరవెర్చబోతున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
మేము చేసే అభివృద్ది పై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. నగర అభివృద్ధికి
ప్రోత్సాహం అందిస్తున్నా జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కృష్ణలంక
రిటైనింగ్ వాల్ జగన్ హయాంలో నిర్మిస్తున్నాం అన్నారు. చంద్రబాబు గతంలో విజయవాడ
నగర అభివృద్ధికి ఇచ్చిన నిధులను అమరావతికి బదిలీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీరావు,
మరుపిళ్ళ రాజేష్,హర్షద్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల
చైర్మన్లు, డైరక్టర్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.