విజయవాడ : ద్విచక్ర వాహనం ( సైకిల్ ) పై దేశాన్ని చుట్టివస్తున్న అశా మాలవ్యను
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ఘర్ జిల్లా
నతారామ్ గ్రామానికి చెందిన మాలవ్య వివిధ రాష్ట్రాలలో సైకిల్ పై పర్యటన
చేస్తూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ముందుకు సాగుతున్నారు. జాతీయ
క్రీడాకారిణిగా, పర్వతారోహకురాలిగా కూడా పరిచయం ఉన్న మాలవ్య మహిళా భద్రత,
మహిళా సాధికారత నినాదాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని
ఎంచుకున్నారు. ద్విచక్ర వాహనంపై దేశంలోని 28 రాష్ట్రాల్లో 25,000 కిలోమీటర్లు
తిరగాలన్న లక్ష్యాన్ని కలిగి ఉన్నానని, ఆంధ్రప్రదేశ్ తో సహా 8 రాష్ట్రాలలో
8,555 కిలోమీటర్ల సైకిలింగ్ పూర్తి అయ్యిందని ఈ సందర్భంగా మాలవ్య గవర్నర్
హరిచందన్ కు వివరించారు. ఉన్నతమైన నినాదాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేస్తున్న
మాలవ్య అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. చిన్న
వయస్సులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఎంచుకుని దేశాన్ని చుట్టివచ్చే
ప్రయత్నం చేయటం గొప్పవిషయని హరిచందన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్
ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్,
ఉప కార్యదర్శి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.