తిరుమల : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి
భవనంలో ఆదివారం ఉదయం నుండి లెక్కించడం ప్రారంభించినట్లు టిటిడి ఈవో ఏవి
ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో నూతన పరకామణి భవనంలో ఈవో ప్రత్యేక పూజలు
నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, బెంగుళూరుకు చెందిన దాత
మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటుు
చేసినట్లు చెప్పారు. గత ఏడాదిి సెప్టెంబర్ 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి నూతన పరకామణి భవనాన్న ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో సీసీ
కెమెరాలు, ఇతర మౌలిిక వసతులు కల్పన పూర్తయినందున ఆదివారం ఉదయం నుండి కానుకలను
లెక్కించడం ప్రారంభించినట్లు తెలియజేశారు. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్
స్వామి వారి ఆశీస్సులతో ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి 12 హుండీలు
చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించినట్లు చెప్పారు. ఇకపై ప్రతిరోజు అన్ని
హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. నెల రోజుల తరువాత ఆలయంలోని
పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు అనువుగా తీర్చిదిద్దనున్నట్లు ఈవో
వివరించారు. అంతకుముందు నూతన పరకామణి భవనంలో వాస్తు హోమం, గోపూజ, శ్రీవారి
చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో పరకామణి లెక్కింపును
పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఇ నాగేశ్వరరావు, ఎస్ఇ-2
జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవో పరకామణి ఇంచార్జ్ రాజేంద్రకుమార్, ఈఈలు
శ్రీహరి, జగన్మోహన్ రెడ్డి, డిఇ రవి శంకర్ రెడ్డి, విజివో బాల్ రెడ్డి,
ఇతర అధికారులు పాల్గొన్నారు.