అమరావతి : కే విశ్వనాథ్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను సినీ నటి, ఏపీ మంత్రి
రోజా శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశ్వనాథ్ లేరని
ఊహించుకోవడమే కష్టంగా ఉందని, ఈ రోజు ఆయన భార్య, కుటుంబ సభ్యులను కలవడం
జరిగిందన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే సినిమాలు అంటే ఏంటో తెలియని విధంగా
చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసింది అంటే ఆశ్చర్యంగా ఉంది. విశ్వనాధ్ కి ఉన్న
పేరు, అభిమానులు గురించి తెలిసి కుటుంబ సభ్యులు అంటున్నారు. నాన్న రిటైర్ అయి
ఇన్ని రోజులు అవుతున్నా అభిమానులు వస్తూనే ఉన్నారంటే షాక్ అవుతున్నామని
అన్నారు. విశ్వనాథ్ సినిమా పరిశ్రమకు చేసిన సేవలు వెలకట్టలేనివి. ముఖ్యంగా
తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి, కల్చర్ కు చేసిన సేవ ఇంకెవరూ
చేయలేరేమో అనిపిస్తుంది. ఆయన చేసిన అన్ని సినిమాల్లో తెలుగుదనం, తెలుగు
సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు. ఆయన సినిమాల నుంచి అందరూ ఒక
మెసేజ్ ను తీసుకుని ముందుకు వెళ్లేలా ఉంటాయి. ఒక దర్శకుడిగా ఒక నటుడిగా ఆయన
ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు, అందరూ ఆదర్శవంతంగా ఆయనను చూసి నేర్చుకునేలా
జీవించారు. ఇప్పుడే వారి కుటుంబ సభ్యులు చెప్పారు ఆయన చాలా డిసిప్లిన్ గా
ఉండేవారు, టైంకు లేవడం మొదలు అన్ని విషయాలు టైం టు టైం చేసేవారని అన్నారు. ఆయన
తెర మీద కనిపించరు కానీ ఆయన పద్దతులు కనిపిస్తాయి, ఆయన క్రమశిక్షణ
కనిపిస్తుంది. ఆయన కనిపించరు కానీ భయం వేస్తుంది, ఆయన ఎప్పుడూ ఎవరినీ
పల్లెత్తు మాట అనరు, కానీ ఆయనని చూసిన వెంటనే ఒక టీచర్ ను చూసినట్టు భయం
వేస్తుంది. నిజంగా ఆయన జీవితం పరిపూర్ణంగా అనుభవించారు. ఆయన ఈరోజు పరమాత్మలో
లీనం అవడంతో ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకోవాలి. తెలుగు నెల ఉన్నంత
వరకు తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన
తెలుగు సినిమాకు చేసిన సేవను గుర్తించి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం
అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన
కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.