విజయవాడ : మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ప్రారంభం అయ్యాయి. విజయవాడ
టికెల్ రోడ్డులోని ఎలైట్ అవుట్ లెట్లో ఆన్ లైన్ లావాదేవీలను ప్రారంభించారు.
ముందుగా 11 అవుట్ లెట్స్‌లో డిజిటల్ లావాదేవీలను ప్రారంభించినట్లు ఎక్సైజ్ శాఖ
స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ తెలిపారు. ఈ డిజిటల్ పేమెంట్స్‌కు ఎస్బీఐ డిజిటల్
పార్టనర్‌గా వ్యవహరిస్తోందన్నారు. డెబిట్ కార్డ్, యుపీఐ లావాదేవీలకు ఎటువంటి
అదనపు ఛార్జీలు ఉండవని, క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు అదనంగా ఛార్జ్ పడుతుందని
తెలిపారు.
మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ప్రారంభం అయ్యాయి. విజయవాడ టికెల్
రోడ్డులోని ఎలైట్ అవుట్ లెట్లో ఆన్లైన్ లావాదేవీలను ప్రారంభించారు. ముందుగా 11
అవుట్ లెట్స్‌లో డిజిటల్ లావాదేవీలను ప్రారంభించినట్లు ఎక్సైజ్ శాఖ స్పెషల్
ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. డిజిటల్ క్యూ ఆర్ కార్డ్ పేమెంట్స్
క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో
ప్రారంబించనున్నారు. గత ఏడు నెలలుగా ఆన్ లైన్ లావాదేవీలపై బ్యాంక్ అధికారులతో
కలిసి కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
సొమ్ము ఏ అకౌంట్ నుండి ఎటు వెళ్లాలి అనే సమస్య ఉండటంతో ఆలస్యమైందని రజత్
భార్గవ అన్నారు. ఈ డిజిటల్ పేమెంట్స్‌కు ఎస్బీఐ డిజిటల్ పార్టనర్‌గా
వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,708 మద్యం దుకాణాలు ఉన్నాయని
తెలిపారు. రానున్న మూడు నెలల్లో మిగిలిన దుకాణాల్లో దశల వారీగా
ప్రారంభించనున్నట్లు ఎస్బీఐ డీజీఎం రంగరాజన్ తెలిపారు. డెబిట్ కార్డ్ ,యుపీఐ
లావాదేవీలకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని, క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు
అదనంగా ఛార్జ్ పడుతుందన్నారు.