విజయవాడ : భువనేశ్వర్లో జరుగుతున్న 74వ జాతీయ మానసిక వైద్యుల వార్షిక
సమావేశంలో విజయవాడకు చెందిన ప్రముఖమానసిక వైద్యులు, ఇండ్ల హాస్పిటల్స్
డైరెక్టర్ అయిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డికి 2022-23కు గాను,
జాతీయస్థాయిలో డాక్టర్ జె. కె. త్రివేది లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును
అందజేశారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా మానసిక వైద్యరంగంలో డాక్టర్ ఇండ్ల చేసిన
సేవలకు గాను, అ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. మానసిక వ్యాధులపై సమాజంలో
వున్న మూఢ నమ్మకాలను, అపోహలను తొలగించి, మానసిక ఆరోగ్యంపై అవగాహన
కల్పించేందుకు డాక్టర్ ఇండ్ల ఎన్నో పుస్తకాలను రాశారు. తెలంగాణ జిల్లాలో
బాణామతి, చేతబడి లాంటి మూఢ నమ్మకాలను తొలగించేందుకు ఆ ప్రాంతాల్లో ఎన్నోమార్లు
పర్యటించారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వినయకుమార్,
-మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.ఎన్.రాజు ఇతర అతిధులు ప్రారంభ సమావేశంలో డాక్టర్
రామసుబ్బారెడ్డిని సత్కరించి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా దేశంలోని
ప్రముఖ మానసిక వైద్యులు, డాక్టర్ ఇండ్లను అభినందించారు. నవ్యాంధ్ర రచయితల సంఘం
ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, రాష్ట్ర అధికార ప్రతినిధి యేమినేని వెంకటరమణ ఈ
సందర్భంగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు అందజేశారు.