తిరుమల : తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక
సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల
మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య
భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో
భక్తులను ఉద్దేశించి , ఆతరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
– శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు
ప్రసారమవుతున్న గరుడపురాణం భక్తుల మన్ననలు పొందుతోంది.
– యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల
ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. దాదాపు 2 వేల మంది యువతీ
యువకులు పాల్గొంటారు.
– ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ.
– ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.
– ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు ` శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ
వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో.
– ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు ` తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి
ఆలయంలో.
– ఫిబ్రవరి 19 నుండి 27వ తేదీ వరకు ` తొండమనాడులోని శ్రీవేంకటేశ్వర స్వామివారి
ఆలయంలో.
– ఫిబ్రవరి 28 నుండి మార్చి 8వ తేదీ వరకు `తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహ
స్వామివారి ఆలయంలో.
జనవరి నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 20.78 లక్షలు.
హుండీ :
– హుండీ కానుకలు ` రూ.123.07 కోట్లు.
లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 1.07 కోట్లు.
అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 37.38 లక్షలు.
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.51 లక్షలు.