హైదరాబాద్ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగుదనం అణువణువునా ఉట్టిపడేలా
ఎన్నో గొప్ప సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాథ్
మృతి తీవ్ర బాధాకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. విశ్వనాథ్
మృతితో సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని, తెలుగు ప్రేక్షకులకు
తీరని లోటు అని తన సంతాప సందేశంలో రవిచంద్ర పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న
విశ్వనాథ్ తెలుగు సినిమాల గొప్పతనాన్ని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పారని ఎంపీ
వద్దిరాజు కొనియాడారు.విశ్వనాథ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన
ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ
రవిచంద్ర భగవంతున్ని ప్రార్థించారు.