విజయవాడ : దర్శక దిగ్గజం , దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాధ్
చనిపోయారన్న వార్తతెలిసి సంగీత సాహిత్య రంగం విషాదంలో మునిగిందని ఏపీపీసీసీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన మరణం సినీసంగీత ప్రపంచానికి
తీరనిలోటని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విచారం
వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.