గుంటూరు : విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన 213 మంది పేద
విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద తొలివిడత సాయాన్ని
ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద మొదటి
విడత సాయంగా 19 కోట్ల 95 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఈ
ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది
విద్యార్ధులకు సాయం అందించనుంది. క్యాంప్ కార్యాలయంలో సీఎ జగన్ బటన్ నొక్కి
లబ్ధిదారుల ఖాతాలకు నేడు నిధులు జమ చేయనున్నారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో
ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా కోటి 25
లక్షల వరకు ట్యూషన్ ఫీజు రీ ఇంబర్స్మెంట్ అందించనున్నారు. విద్యార్ధులకు
విమాన, వీసా ఛార్జీలు సైతం రీఇంబర్స్మెంట్ చేస్తున్నట్లు ప్రభుత్వం
తెలిపింది.