కొవ్వూరు : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 87వ రోజు కొవ్వూరు టౌన్
లోని బ్రిడ్జి పేటలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. కొవ్వూరు 14వ వార్డు
లోని ఇంటింటికి తిరిగి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి
లబ్ధిదారులకు వివరించారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, పెన్షన్లు, వసతి దీవెన,
విద్యా దీవెన, రైతు భరోసా, ఇళ్ల స్థలాలు వంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు
ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని హోంమంత్రి తానేటి వనిత స్పష్టంచేశారు. అదేవిధంగా
గ్రామాల్లో ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని ఉద్దేశంతోనే సీఎం జగన్
గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల
మేరకు కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ కలిసి వారి సమస్యలను
తెలుసుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. ప్రజల నుండి వస్తున్న వినతులను
తీసుకొని సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని హోంమంత్రి తానేటి వనిత
ఆదేశించారు.