గుంటూరు : నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వైసీపీ
అధిష్ఠానం వేటు వేసింది. జిల్లా నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల
ప్రభాకర్‌రెడ్డిని నియమించింది. ఇంఛార్జ్ బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించి
ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ వైసీపీ నిర్ణయం
తీసుకుంది. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఇంఛార్జ్
బాధ్యతల నుంచి తొలగించిన పార్టీ అధిష్ఠానం.. ఆ ప్లేసులో ఎంపీ ఆదాల
ప్రభాకర్‌రెడ్డిని నియమించింది. నెల్లూరు జిల్లా వ్యవహారంపై వైసీపీ నేతలతో సీఎం
జగన్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ
సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదాల
ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌ను సీఎం జగన్ సీరియస్‌గా తీసుకున్నట్లు మాజీ మంత్రి బాలినేని
శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కాదని, అది రికార్డింగ్ అని
ఛాలెంజ్ చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే ఫోన్ కాల్‌ను ఆయన స్నేహితుడే
రికార్డింగ్ చేశారని, ఫోన్ ట్యాపింగ్‌పై ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి
నిరూపించాలని సవాల్ చేశారు. కోటంరెడ్డిపై చర్యలకు సంబంధించి త్వరలో చర్చించి
నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడే ఎందుకు
చెప్పారని, వెళ్లే ముందు ఏదో ఒక విమర్శ చేసి పోతున్నారని అన్నారు.నిన్న
నెల్లూరు వ్యవహారంపై నేతలతో చర్చించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం
మరోసారి సమావేశ మయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ
మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డితో సమావేశం జరిపారు.
నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్‌పై చర్చించి ఆ పదవి నుంచి కోటంరెడ్డిని తప్పించి
ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం తాజాగా నిర్ణయం
తీసుకుంది.