జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని ఎన్టీఆర్
జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. స్థానిక 49వ డివిజన్ లోని 167వ సచివాలయం
పరిధిలో 181వ రోజు గురువారం గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ
కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ
నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఆయా ప్రాంతాలలో
పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన
సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా
వెలంపల్లి మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలో అభివృద్ది కోసమే గడప గడపకు
వెళ్తున్నామన్నారు. అందరూ కలిసి వస్తున్నారన్నారు. అర్హత వున్నవారికి పథకాలు
వస్తున్నాయన్నారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దేవదానం కు కూడా సంక్షేమ
పథకాలు ఇచ్చామని తెలిపారు. గతంలో చంద్రబాబు ఇల్లు ఇస్తాం అని చెప్పి ప్రజలతో
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు నాయుడు
ప్రజలను మోసం చేశాడన్నారు. కొండా ప్రాంతం కావడంతో కొంత మెట్లు కాలువలు సమస్యలు
మా దృష్టికి వచ్చాయి వాటిని త్వరితగతిన అభివృద్ధి చేస్తామని హామీ
ఇచ్చామన్నారు. నియమ నిబంధనలు ప్రకారమే పథకాలు ఇస్తున్నామన్నారు. ఈ
కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 49వ డివిజన్ డివిజన్ నాయకులు
కార్యకర్తలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,
డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు,
నగరపాలక సంస్థ, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.