నరసన్నపేట : కీర్తి శేషులు ధర్మాన సావిత్రమ్మ మనుమడు, కీ.శే. వాసుదేవరావు
కుమారుడు, ధర్మాన రామ్ భరత్ నాయుడు (32) గురువారం ఉదయం విశాఖపట్నంలో మృతి
చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన విశాఖలో ఒక ప్రైవేట్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. మాజీ డిప్యూటీ సీఎం
ధర్మాన కృష్ణదాస్, మంత్రి ధర్మాన ప్రసాదరావుల సోదరుడు వాసు కుమారుని మరణవార్త
తెలిసిన వెంటనే ధర్మాన కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖపట్నం తరలి వెళ్ళారు.
పోలాకి మండలం మబగాంలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నామని, పిన
తండ్రి ధర్మాన రాందాస్ తెలిపారు. రామ్ భరత్ మరణ వార్తతో స్వగ్రామం మబుగాంలో
విషాదఛాయలు అలుముకున్నాయి.