విజయవాడ : జర్నలిజం లో నాలుగు దశాబ్దాల పాటు సమస్యలపై అలుపెరుగని పోరాటం
చేస్తూ అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్న వ్యక్తి దాసరి ఆల్వార స్వామి అని
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఈనాడు
దినపత్రికలో తాను పనిచేసిన సందర్భంలో ఆల్వార్ స్వామి తన సహచర మిత్రుడని,
సమాచార వ్యవస్థ సరైన విధంగా అందుబాటులో లేని రోజుల్లో వార్త సేకరణలో ఆల్వార
స్వామి ముందంజలో ఉండేవారని ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా తాను నమ్మిన
సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వ్యక్తుల్లో ఆల్వార స్వామి ఒకరిని కొమ్మినేని
అన్నారు. జర్నలిజం వృత్తిలో కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్టులను ప్రెస్
అకాడమి గౌరవించి వారిని సత్కరిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేస్తోందని ప్రెస్
అకాడమి చైర్మన్ తెలిపారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన
అనంతరం తన సహచర మిత్రులందరికీ కలుసుకోవడం ఆనందంగా ఉందని దానిలో భాగంగా
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కుందేరు గ్రామంలో నివసిస్తున్న సీనియర్
జర్నలిస్ట్ దాసరి ఆల్వార్ స్వామిని కలుసుకొని సి రాఘవాచారి ఆంధ్రప్రదేశ్
ప్రెస్ అకాడమీ తరుపున జర్నలిస్టుగా సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్
అకాడమీ తరపున అభినందన పత్రం అందజేసి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమాన్ని
ప్రెస్ అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్ సమన్వయం చేసారు.