చిత్తూరు : చెట్టంత కొడుకుని రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. అండగా ఉండే
తనయుడు దూరం కావడంతో ఆ తల్లిదండ్రుల గుండెకోత అంతా ఇంతా కాదు. ఇటువంటి
కష్టసమయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన వారికి టిడిపి బీమా
పరిహారంతో చేయూతనందించింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం
బైరెడ్డిపల్లె మండలం కొలమసనపల్లె గ్రామానికి చెందిన ఎన్.
సుబ్రహ్మణ్యం రెడ్డి, సరసమ్మ దంపతుల కుమారుడు శ్రీనాథ్‌రెడ్డి డిప్లొమా
చేశాడు. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు స్థానికంగా ఉన్న రత్నా బయోటెక్
ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. 2015 డిసెంబరు 1వ తేదీన ఆర్టీసీ బస్సు
ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో శ్రీనాథ్ రెడ్డి చనిపోయాడు. అన్నీ తానై
కుటుంబాన్ని చూసుకుంటున్న వారసుడు ఇక లేడని తెలిసిన తల్లిదండ్రులు
తల్లడిల్లిపోయారు. కన్నకొడుకు కళ్లముందే విగతజీవుడైన దృశ్యం
కన్నవాళ్లకు కంటిమీద కునుకునీ దూరం చేసింది. ఈ కష్టకాలంలో తెలుగుదేశం
పార్టీ తమ కుటుంబీకులకి అండగా నిలిచింది. చిరు చేయూతని అందించింది. టిడిపి
సభ్యత్వం ద్వారా వచ్చిన రూ. 2లక్షలు బీమా పరిహారాన్ని శ్రీనాథ్ రెడ్డి
కుటుంబానికి అందజేసింది. ఈ సొమ్ముతో పాడిపశువులను కొనుగోలు చేసి, డెయిరీకి
పాలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబం. పాదయాత్రలో
తమ ఊరు మీదుగా వెళుతున్న నారా లోకేష్‌ని సుబ్రహ్మణ్యం రెడ్డి కలిశారు.
కన్నకొడుకు దూరమైన శోకంలో ఉన్న తమకు టిడిపి బీమా సాయంగా నిలిచిందని
వివరించి కృతజ్ఞతలు తెలియజేశారు.