విజయవాడ : అందరితో కలిసి ప్రజల వద్దకు వెళుతున్నామని, మా దృష్టి కి వచ్చిన
సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తున్నామని
ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ
శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
స్థానిక 49వ డివిజన్ లోని 167వ సచివాలయం పరిధిలో 180వ రోజు బుధవారం గడప గడపకు
మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆయన ఆయా
ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ
పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి
తెలుసుకున్నారు. అనంతరం ఒకటో తారీకు కావడంతో పించన్ దారులకు పింఛన్లు పంపిణీ
చేశారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ కొండ ప్రాంతంలో అందరికీ అన్నీ సంక్షేమ
పథకాలు అందుతున్నా యన్నారు. అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం
జరిగిందన్నారు. అందరి తో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నామని తెలిపారు. డ్రైనేజీ
సమస్య వుంది త్వరితగతిన అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మా
దృష్టి కి వచ్చిన సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ
కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 49వ డివిజన్ డివిజన్ నాయకులు
కార్యకర్తలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,
డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు,
నగరపాలక సంస్థ, రెవెన్యూ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.