విశాఖపట్నం : ముఖ్యమంత్రి ఎక్కడుంటే రాజధాని అక్కడే అని మంత్రి గుడివాడ
అమర్నాథ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలోని నాయకులందరూ దీనికి కట్టుబడి
ఉన్నారని, ప్రభుత్వం మూడు రాజధానులు చేయాలని నిర్ణయం తీసుకుందని
పునరుద్ఘటించారు. ముఖ్యమంత్రి రాజు లాంటివారని, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే
రాజధాని అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి వస్తే రాజధాని
వస్తుందన్నారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు విశాఖకు అన్ని హంగులు ఉన్నాయని
తెలిపారు. అవసరాన్ని బట్టి ఐటీ, పర్యాటక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర
శాఖల భవనాలను అవసరాన్ని తగినట్టుగా వాడుకుంటామని వెల్లడించారు. ఏది కుదరకపోతే
ప్రైవేట్ భవనాలు అద్దెకు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి విశాఖకు రావాలని,
ఇక్కడ నివాసం ఉండాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు
జరుగుతాయన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రాజధానులుగా చేయాలని నిర్ణయం
తీసుకుందని, దానికి అందరమూ కట్టుబడి ఉన్నామని వివరించారు. విశాఖపట్నం పరిపాలన
రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా నిర్ణయం
తీసుకున్నామని వెల్లడించారు.