విజయవాడ : స్థానిక 56వ డివిజన్ లోని 224వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన
ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి
శ్రీనివాసరావు పాల్గొని ఆయా ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ
మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ
సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ రొండో రోజు కూడా 224వ సచివాలయంలో తిరగడం
జరిగిందన్నారు. ఓల్డ్ అర్ అర్ పేట ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని
హామీ ఇచ్చారు. రోడ్లు వెయ్యాలను కొందరు అడిగారు. త్వరితగతిన వేస్తాం అని హామీ
ఇచ్చామన్నారు. అందరి సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. చంద్రబాబు
హయాంలో ఎన్ని కంపెనీలు తెచ్చారని ప్రశ్నించారు. జగనన్న మాటలతో కాదు చేతల్లో
చేసి చూపిస్తున్నాడన్నారు. కరోనా కష్ట కాలంలో కుడా ప్రజలను ఆదుకున్నాడన్నారు.
చంద్రబాబు మాటల మనిషి జగన్ చేతల మనిషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 56వ
డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు డివిజన్ నాయకులు కార్యకర్తలు,వివిధ
డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ
నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, నగరపాలక సంస్థ, రెవిన్యు
తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.