స్వీకరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ అన్నారు. మంగళవారం
విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్
సౌజన్యంతో నిర్వహిస్తున్న సౌత్ జోన్ వైస్ చాన్సలర్స్ మీట్ 2023‘ని గవర్నర్
ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద
స్టార్టప్ ఎకోసిస్టం కలిగి ఉందని నాస్కామ్ స్పష్టం చేసిందన్నారు. 2022 నాటికి
దేశంలో 80 వేలకు పైగా స్టార్టప్ సంస్థలు ఉన్నాయన్నారు. దేశ అభివృద్దికి ఉన్నత
విద్య ఎంతో ప్రధానమైన అంశంమని, భవిష్యత్ నాయకులు తయారు చేయడానికి అధునాతన
జ్ఞానం, నైపుణ్యాలను అందించడం ద్వారా దేశ నిర్మాణం చేయాలన్నారు. తద్వారా
బలమైన సామాజిక ఆర్ధిక వ్యవస్థను నిర్మించడం వీలవుతుందన్నారు. నాణ్యమైన ఉన్నత
విద్యను అందించడం నేడు ప్రధానమైన అంశమన్నారు. నూతన విద్య విధానంలో భాగంగా
పరిశోధనలకు ప్రాధాన్యత పెంపుదల చేయడం జరిగిందన్నారు.ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లలో అత్యుత్తమస్థానంలో భారతీయ విశ్వవిద్యాలయాలు
స్థానం సాధించాలని సూచించారు. విద్యార్థులలో పరిశోధన ఆలోచనలు, ఆసక్తిని పెంచే
విధంగా ఉపకులపతులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఐయూ
ప్రత్యేక సంచికను గవర్నర్ ఆవిష్కరించారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా
సమిష్టిగా పనిచేయాలని దిశనిర్ధేశం తగిన చేయాలని అన్నారు.
డిజిటల్ తాళపత్రాల ఆవిష్కరణ:
ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్ వి.ఎస్ కృష్ణ గ్రంధాలయంలో దశాబ్ధాల కాలంలో ఉన్న
2.5 లక్షల తాళపత్రాలను డిజిటలైజేషన్ చేసారు. వీటిని రాష్ట్ర గవర్నర్
బిశ్వభూషన్ హరిచందన్ బటన్ నొక్కి క్లౌడ్‌లో అప్లోడ్ చేసారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం వద్ద దశాబ్ధాలుగా 1109 మంది అందించిన 2.62 లక్షల పురాతన
తాళపత్రాలు ఉండగా వీటిని బధ్రపరచడానికి భవిష్యత్ తరాలకు, పరిశోధనలకు
ఉపయుక్తంగా నిలపడానికి గత రెండు సంవత్సరాలుగా ప్రత్యేక సాంకేతికత ఉపకరణాలతో
2.16 లక్షల తాళపత్రాలను డిజిటలైజేషన్ చేసారు. సంస్కృతం, తెలుగు, తమిళం,
మళయాళం, కన్నడం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్న ఈ తాళపత్రాల జ్ఞానం అన్ని
విశ్వవిద్యాలయాలు వినియోగించుకునే అవకాశం కల్పించారు. తద్వారా స్థానిక భాషలో ఈ
జ్ఞానాన్ని పొందడం, భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా మలచడం సాధ్యపడుతోంది.