గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి లోని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్
మందపాటి శేషగిరిరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన
మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రంధాలయానికి వచ్చే సెస్ ను పక్కదారి
మళ్ళించి గ్రంథాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, అలాంటి పరిస్థితి నుండి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రంథాలయాలను అభివృధ్ధి చేయటంతో పాటు
డిజిటలైజేషన్ కి చర్యలు చేపట్టడం గొప్ప విషయమని కొమ్మినేని శ్రీనివాసరావు
అన్నారు. అలాగే ప్రెస్ అకాడమీ తరపున సీనియర్ జర్నలిస్ట్ లు రాసిన పుస్తకాలను
పబ్లిష్ చేసి వాటిని వెలుగులోకి తీసుకురావాలని, గ్రంథాలయ పరిషత్తు వారు
ప్రాధాన్య క్రమంలో ఆ పుస్తకాలను కొనుగోలు చేసి రాష్ట్రంలోని అన్ని
గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటిని కోరారు.
సీనియర్ జర్నలిస్టుల పూర్తి వివరాల సమాచారంతో వారి ప్రొఫైల్స్ ని డిజిటల్
మీడియా ద్వారా అకాడమీ వెబ్ సైట్ లో వీడియో లైబ్రరీగా రూపొందించనున్నామని
కొమ్మినేని అన్నారు. గ్రంథాలయాల అభివృధ్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, పోటి
పరిక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు గ్రామీణ స్థాయిలో
లైబ్రరీ సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్
చైర్మన్ మందపాటి శేషగిరిరావు తెలిపారు. కొమ్మినేని తాను రచించిన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సామాజిక విశ్లేషణ పుస్తకాన్ని మందపాటి శేషగిరిరావు కు
అందచేసారు. ఈ సందర్భంగా మందపాటి శేషగిరిరావు ప్రెస్ అకాడమి చైర్మన్
కొమ్మినేని శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు.