నియోజకవర్గంలో అయిదో రోజు కొనసాగింది. కొమ్మరమడుగులో పాదయాత్రకు మద్దతు
తెలిపేందుకు వచ్చిన అరటి రైతులతో భేటీ అయిన ఆయన వారి సమస్యలు తెలుసుకున్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి
పెట్టి వాటిని పరిష్కరిస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా
కొమ్మరమడుగులో పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అరటి రైతులతో భేటీ అయిన
ఆయన వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడి
అవుతోందని రైతులు లోకేశ్ ఎదుట వాపోయారు. ఎరువులు, కూలీలు, విత్తనం ధర భారీగా
పెరిగాయన్నారు. కిలోకు 15 రూపాయల ధర కూడా రావడం లేదన్నారు. వారి సమస్యలు విన్న
లోకేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడతానన్నారు.సమస్యలు తెలుసుకుంటూ ముందుకు
ఈనెల 28 నుంచి కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. దాదాపు
4000 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. తొలిరోజు పాదయాత్రకు
రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున
తరలివచ్చారు. ప్రతీ చోట ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ
చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ నాలుగు
రోజుల్లో పలువురు రైతులతో మాట్లాడిన లోకేష్ వారి సమస్యలను అడిగి
తెలుసుకున్నారు. రైతులు తాము పడుతున్న ఇబ్బందులను లోకేష్ ముందు ఏకరవు
పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు తీరుస్తామని రైతులకు హామీ
ఇస్తూ లోకేష్ పాదయాత్రలో ముందుకు వెళుతున్నారు.