ఎన్ఐఏకు కోర్టు ఆదేశాలు
జగన్ పై దాడి కేసును విచారించిన విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు
బాధితుడు జగన్ కోర్టుకు రావాలని కోర్టు ఆదేశం
జగన్ కోర్టుకు వచ్చేలా విక్టిమ్ షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏకు ఆదేశాలు
గుంటూరు : వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో నాడు జరిగిన దాడి కేసు ఇరు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు
ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై శ్రీనివాస్ అనే
యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో
కొనసాగుతోంది. ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.
తదుపరి విచారణకు జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఈ కేసులో
తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు
హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను కోర్టుకు
సమర్పించాలని ఆదేశించింది. ఇందులో విక్టిమ్ (బాధితుడు) షెడ్యూల్ కూడా ఉండాలని
తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా
షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను
ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ
చేశారు.