పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలి
జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపు
శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరం పెద్దపాడు సమీపంలో జాతీయ రహదారిపై వరుణ్
మోటార్స్ వెనుక వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి బుధవారం
శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
కృష్ణదాస్ తెలిపారు. ఉదయం 8 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని
మంత్రులు, శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, జెడ్పీ చైర్
పర్సన్, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, పార్టీ కార్యవర్గం, అనుబంధ కమిటీల
ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి మంగళవారం ఉదయం
ఆయన కార్యాలయ నిర్మాణం జరిగే స్థలాన్ని పరిశీలించారు. సైట్ ఇంజనీర్ కు పలు
సూచనలు చేశారు. శంకుస్థాపన అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశం ఉంటుందని
చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న జిల్లా పార్టీ కార్యాలయ భవనానికి
ఇప్పటికే స్కెచ్ రూపొందించినట్లు పేర్కొన్నారు. త్వరిత గతిన భవనాన్ని
పూర్తిచేసి అతి త్వరలో పార్టీ కార్యకలాపాలు ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని
కృష్ణ దాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్
మామిడి శ్రీకాంత్, కళింగ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ అందవరకు సూరిబాబు, పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, డీసీఎంఎస్ చైర్పర్సన్ ప్రతినిధి సళ్ళా
దేవరాజ్, మెంటాడ స్వరూప్, ఎన్ని ధనుంజయ రావు, సూర శ్రీనివాసరావు, మహమ్మద్
సిరాజుద్దీన్, బొబ్బది ఈశ్వరరావు నల్లబారిక శ్రీను, కనపల తేజ తదితరులు
పాల్గొన్నారు.