విజయవాడ : విజయవాడ కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు
ఇంజనీరింగ్ కాలేజిలో జరుగుతున్న అమరావతి బాలోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు
పిల్లల్లో జోష్ ను నింపాయి. కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం 3,600
మంది విద్యార్థినీ విద్యార్థు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గని తమ
ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ విభాగంలో జానపద నృత్యాలు, జానపద
గీతాలాపన, దేశభక్తి, అభ్యుదయ గీతాలాపన, క్లాసికల్ డాన్స్, లఘు నాటికల్లో
చిన్నారులు పార్టీని అలరించారు. అలాగే సైన్సు ఎగ్జిబిషన్లో జూనియర్స్,
సీనియర్స్, కార్టూన్లో జూనియర్స్, చిత్రలేఖనంలో సబ్ జూనియర్స్, జూనియర్స్,
సీనియర్స్ విద్యార్ధినీ విద్యార్థులు పాల్గని తమ ప్రతిభను ప్రదర్శించారు.
మెమొరి టెస్ట్‌కు సల్, జూనియర్స్, జూనియర్స్, కథా రచనలో జూనియర్స్, వ్యాసరచన
(తెలుగు), జూనియర్స్, సీనియర్స్, వ్యాసరచన (ఇంగ్లీష్), స్పెల్ బీ, మాప్
పోటీలలో జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని
తమ ప్రతిభను ప్రదర్శించారు.
భళా సైన్స్ ప్రదర్శనలు
బాలోత్సవంలో రెండవ రోజు జూనియర్స్, సీనియర్స్ విభాగంలో నిర్వహించిన సైన్స్
ఎగ్జిబిషన్లో విద్యార్థులు పాల్గని తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు. గన్నవరం
స్రవంతి హైస్కూల్‌కు చెందిన జయ ఆదిత్య విద్యార్థి హైడ్రాలిక్ ఫుట్‌పాత్
పరికరాన్ని తీర్చిదిద్దాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు హైడ్రాలిక్ ఫుట్
పాత్ ఎంతో కీలకంగా పనిచేస్తుందన్నది సారాంశం. మరో ప్రదర్శన హైడ్రాలిక్ బ్రీ
షిఫ్ట్ మెషిన్ ను నూజివీడు కుమార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన సి. హెచ్.
హాసిని ప్రదర్శించి అబ్బుర పరిచింది. ఈ మెషిన్ ఉపయోగం ఏమంటే ఇంటిలో చెట్లు
ఉంటే ఎవరైనా ఆ ఇంట్లో భవనం నిర్మించదలచుకుంటే ఆ చెట్టును కొట్టి చేయకుండా మరో
చోట పెట్టేందుకు షిఫ్టింగ్ చేయవచ్చు. గుంటుపల్లి సెయింట్ ఆన్స్ స్కూల్‌కు
చెందిన చిన్నారి ఖాజా జియావుద్దీన్ ఏటిఎం మిషన్ నమానా తయారుచేసి
ఆడ్డుకున్నాడు. చిత్రలేఖనంలో జూనియర్, సీనియర్స్ సుమారు 650 మంది పాల్గోని పలు
రకాల చిత్రాలను గీశారు. కార్టూన్ గీయటంలోను సత్తా చాటుకున్నారు. ఈ
కార్యక్రమాలను బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, అధ్యక్షులు
ఎన్.పి. రామరాజు, అమరావతి ఆఫీస్ బేరర్స్ పి. మురళీకృష్ణ, జి. జోత్స్య,
పారిశ్రామిక వేత్త బాయన వెంకటరావు, గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, కె.
వెంకట్, ఎ.వి. రామరాజు తదితరులు పాల్గొని కార్యక్రమాలను జయప్రదంగా
నిర్వహించారు.