సురక్షితంగా గన్నవరం ఎయిర్పోర్టులో తిరిగి ల్యాండింగ్
ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
అమరావతి : ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంకోసం ఢిల్లీ
వెళ్తున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో
సాంకేతిక లోపం తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం
విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ పర్యటనకోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం
సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక
సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం
5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి
చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ
ఏర్పాట్లు చేస్తున్నారు.