ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వి.సి. ప్రొఫెసర్ పి. రాజశేఖర్
గుంటూరు : విద్యారంగంలో వైఙ్ఞానిక ప్రదర్శలను ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పట్టేటి రాజశేఖర్ అన్నారు.
సోమవారం మార్కెట్ కూడలి లోని హిందూ కళాశాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైన్స్
సిటీ సౌజన్యంతో మూడు రోజుల పాటు జరుగనున్న సైన్స్ ఎక్స్పో-2023 ప్రారంభోత్సవ
సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు కళాశాల ప్రిస్సిపాల్ పీఎం
ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి పట్టేటి రాజశేఖర్ మాట్టాడుతూ సైన్స్
ఎగ్జిబిషన్ లనేవి ఏర్పాటు చేస్తే వాటిలో పాల్గొనే విద్యార్థులు తమ మేథస్సు కు
పదును పెడుతూ నూతన ఆవిష్కరణలను చేస్తుంటారని అందుకే ఇలాంటివి నిర్వహించటం
ఎంతైనా అవసరమన్నారు. న్యూయార్క్ తదితర ప్రాంతాలలో ప్రతి సంవత్సరం తప్పని సరిగా
ఒక ఉత్సవంలా సైన్స్ ఎగ్జిబిషన్లను పెడుతూంటారన్నారు. నగర మేయర్ కావటి శివనాగ
మనోహరనాయుడు మాట్లాడుతూ తాను హిందూ కళాశాల పూర్వవిద్యార్థినేనని తన కళాశాల 300
అంశాలతో నగరంలోని 100 పాఠశాలలు, కళాశాలలను సమన్వయ పరచి ఎంతో ఆసక్తికర అంశాలతో
సైన్స్ ఎక్స్ పో ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. విద్యాలయాలు ఎగ్జిబిషన్లతో
పాటు విద్యార్థులలో క్రీడల మీద ఆసక్తిని కలికించేందుకు స్సోర్ట్స్’ మీట్ లను
కూడా ఏర్పాటు చెయ్యాలన్నారు. రాష్ట్రప్రభుత్వం విద్యారంగంలో విఙ్ఞానాన్ని,
క్రీడలను అభివృద్ధి చేసేందుకు తగిన పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఎంఎల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ తాను రెండున్నర దశాబ్దాల పాటు హిందూ
కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసానని, ఎంతో గొప్ప చరిత్ర వున్న హిందూ కళాశాల
అంతే గొప్ప స్థాయిలో సైన్స్ ఎక్స్పోను ఏర్సాటు చేయటం ఆనందంగా వుందన్నారు. సభలో
కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణ మూర్తి, హెచ్సీహెచ్ఎస్ కౌన్సిల్ అధ్యక్షుడు
గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్, ఎక్స్పో కన్వీనర్ డాక్టర్ మన్నవ మాధవి, ఆంగ్ల శాఖ
అధ్యాపకురాలు చిలకా అరుణ, వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ దుర్గాప్రసాద్ తదితరులు
ప్రసంగించారు. ఎక్స్పోలో పలు పాఠాశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆసక్తికర
అంశాలను చూడటానికి బారులు తీరిన విద్యార్థులతో ప్రాంగణ కిటకిటలాడింది. మంగళ,
బుధవారాలలో కూడా ప్రదర్శన వుంటుందని ఎవరైనా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల
లోపు ఉచితంగా ప్రదర్శనను తిలకించ వచ్చని నిర్వాహకులు చెప్పారు. అయితే ట్రాఫిక్
సమస్య రాకుండా కాలేజికి ఎదురుగా వున్న వెంకటేశ్వర విఙ్ఞాన మందిరంలో
సందర్శకులు తమ వాహనాలను నిలుపుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.