కట్టుకొని నిరసనజీవో నెంబర్ 1 ఎంపీ భరత్ కు వర్తించదా : అఖిలపక్ష నేతల విమర్శ
రాజమహేంద్రవరం : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రాన్ని
కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న జగన్ నిరంకుశ వైఖరి నశించాలని
కోరుతూ జీవో నెంబర్ 1 నల్ల జీవోను రద్దు చేయాలని కోరుతూ టిడిపి జనసేన సిపిఐ
సిపిఎం కాంగ్రెస్ బీఎస్పీ ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో సోమవారం
ఉదయం స్థానిక జాంపేట మహాత్మా గాంధీ విగ్రహం ముందు నోరు కు నల్లరెబ్బను
కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు
మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా జీవో నెంబర్ వన్
తీసుకొచ్చారని ఆయన అన్నారు ఈ నల్ల జీవో కు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్రంలో
పలు ఆందోళనలు చేశామని ఆ జీవో వెనక్కి వెళ్లే వరకు ఉద్యమం ఆగదని ముప్పాళ్ళ
చెప్పారు
రూరల్ ఎమ్మెల్యే రాష్ట్ర టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఈ నల్ల జీవో ప్రతిపక్షాలకేనా రాజమండ్రి
ఎంపీ భరత్ కు వర్తించదా అన్నారు నడిరోడ్డు మీద జనం ఎక్కువగా తిరిగే ప్రాంతం
నందగనిరాజు సెంటర్లో అడ్డంగా స్టేజి గట్టి నగర ప్రజలను ఇబ్బందులు పడుతుంటే
పోలీసులు మాత్రం చూస్తూ ఊరుకున్నారని ఆయన విమర్శించారు ఈ జీవో ఆయన వర్తించదా
అని చెప్పారు
జనసేన పిఎసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కందులు దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో
ప్రజాస్వామ్య ఉల్లంఘన రాజ్యాంగ నిర్వీర్యం జరుగుతుందని ప్రశ్నించే గొంతును
నొక్కేస్తున్నారని ప్రజాసంస్థలపై సమస్యలపై ఉద్యమించే ప్రతిపక్షాలను జీవో
నెంబర్ వన్ చూపించి ఆపడం అన్యాయం అన్నారు
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ నల్ల జీవో రద్దు చేసే వరకు ఈ
పోరాటం ఆగదని అవసరమైతే ఢిల్లీ పురవీధుల్లో ఆంధ్రప్రదేశ్ హక్కులపై
ఉద్యమిస్తామన్నారు జగన్ తన నీడను చూసి ఆయనే హడలిపోతున్నారని తెలిపారు
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దానిపై ప్రజలు
ఉద్యమిస్తారని భయంతోనే ఈ జీవో తీసుకొచ్చారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం
పార్టీ సీనియర్ నాయకులు టీ ఎస్ ప్రకాష్ సిఐటియు జిల్లా కార్యదర్శి పూర్ణిమ
రాజుకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళి టిడిపి రాష్ట్ర రాష్ట్ర
కార్యదర్శ లు రెడ్డి mమణి కాశీ నవీన్ కుమార్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ
నాయకులు జోజి రమణ సిపిఐ నగర కార్యదర్శి
వి కొండలరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి సునీల్ ఎస్ఎఫ్ఐ రాజా
అఖిలపక్ష నేతలు మజ్జి రాంబాబు వాసిరెడ్డి రాంబాబు సిపిని రమణమ్మ ఎడ్ల లక్ష్మి
జి ఏ రామారావు ఆచంట సత్యనారాయణ కే జ్యోతి రాజు తదితరులు పాల్గొన్నారు.